చేనేత కార్మికులకు అండగా నిలబడదాం: కేటీఆర్

392
ktr siricilla

చేనేత కార్మికులకు అండగా నిలబడదామని పిలుపునిచ్చారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన కేటీఆర్ .. సిరిసిల్ల ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్, అదనపు తరగతి గదులను ప్రారంభించారు.

అనంతరం జిల్లా పరిషత్ తొలి సర్వసభ్య సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. పంచాయతీరాజ్ చట్టం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని… కొత్త పంచాయతీరాజ్ చట్టంలో జవాబుదారీతనంపై ఎక్కువగా దృష్టి పెట్టారని చెప్పారు. అధికారులతో పని చేయించుకోవాలంటే చట్టంపై అవగాహన ఉండాలని… విధులు, బాధ్యతలు తెలుసుకోకపోవడం వల్లే గొడవలు వస్తాయి అని కేటీఆర్ పేర్కొన్నారు.

చేనేత దినోత్సవం రోజు ప్రతి సోమవారం చేనేత దుస్తులు ధరించే విధంగా ప్రతిజ్ఞ చేద్దామన్నారు. చేనేత దుస్తులు ధరించడంలో జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ ఆదర్శంగా ఉన్నారు..మనమంతా ఆయన బాటలో నడుద్దామని చెప్పారు. ప్రపంచంలో అత్యంత వేగంగా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేసిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రకు ఎక్కిందన్నారు. ఇటీవల ప్రాజెక్టును సందర్శించిన కేంద్ర ఐఏఎస్ ల బృందం సీఎం కేసీఆర్‌కు నోబెల్ బహుమతి ఇవ్వాలన్నారు ,అంతకంటే మనకు కావాల్సింది ఏముందన్నారు.

సమావేశాల్లో అరిచేకంటే పూర్తి అవగాహనతో అధికారులను నిలదీసి పని చేయించాలన్నారు. పరుషపదజాలంతో నిందించే కంటే సమస్యపై పూర్తి అవగాహనతో వ్యహరించాలని… అరిస్తే పేపర్లో ఫోటో వస్తుంది తప్ప ప్రజల్లో పేరు రాదనే విషయం తెలుసుకోవాలన్నారు. జడ్పీటీసీలు మండలానికి జిల్లాకు మధ్య వారధుల్లా వ్యవహరించాలి.

ఇప్పటికే రాజకీయనాయకులు అంటే ప్రజల్లో సదాభిప్రాయం లేదు. మనం ప్రజల్లో రాజకీయనాయకుల పట్ల గొరవం పెరిగే విధంగా చూడాలన్నారు.పార్టీ ఏదయినా అందరితో సమన్వయంతో వ్యవహరించి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రమేశ్ బాబు, సుంకే రవిశంకర్, రసమయి బాలకిషన్, జడ్పీ చైర్‌పర్సన్‌తో పాటు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.