‘కొబ్బరిమట్ట’ కోసం మోహన్‌బాబు..!

728
kobbari matta
- Advertisement -

హ్రుద‌య‌కాలేయం సినిమాతో టాలీవుడ్‌లో క్రేజ్‌ సంపాధించుకున్న బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు త్రిపాత్రాభిన‌యంలో హ్రుద‌య‌కాలేయం డైరెక్టర్‌ స్టీవెన్ శంక‌ర్ అందించిన క‌థ‌, క‌థ‌నం, మాట‌లతో కొబ్బ‌రిమ‌ట్ట చిత్రాన్ని రూపోందించారు. ఈ సినిమాతో రూప‌క్ రొనాల్డ్ స‌న్ ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు.

ఈ చిత్రం ఆగస్టు 10వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ రోజున సాయంత్రం 6 గంటలకు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. మాదాపూర్‌లోని సైబర్ కన్వెన్షన్‌లో ఈ వేడుకను జరపనున్నారు. అయితే ఈ వేడుకకి ఓ ముఖ్య అతిథి రానున్నారు. ఆయన ఎవరో కాదు.. డైలాంగ్ కింగ్ మోహన్ బాబు.

మోహన్‌ బాబు అతిథిగా రావడంపై సంపూ ట్విట్టర్ ద్వారా స్పందించాడు .. “నాలాంటి ఒక చిన్న నటుడు రిలీజ్ ఫంక్షన్‌కి రమ్మని అడిగిన వెంటనే ఆశీర్వదించడానికి విచ్చేస్తున్న రియల్ పెదరాయుడు శ్రీ మోహన్ బాబు గారికి పాదాభివందనాలు” అంటూ ఒక స్పెషల్ పోస్టర్‌ను వదిలాడు.

- Advertisement -