ఆకట్టుకుంటున్న ‘సాహో’ కొత్త పోస్టర్‌..

475
- Advertisement -

టాలీవుడ్‌ హీరో ప్రభాస్ ప్రస్తుతం ‘సాహో’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. సుజిత్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. శ్రద్ధా కపూర్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో నీల్ నితిన్ ముఖేశ్ .. అరుణ్ విజయ్ ప్రధానమైన ప్రతినాయకులుగా కనిపించనున్నారు.

తెలుగుతో పాటు తమిళ.. మలయాళ.. హిందీ భాషల్లో ఈ సినిమాను ఈ నెల 30వ తేదీన విడుదల చేయనున్నారు. పలు భాషలకి చెందిన నటీనటులు ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ప్రధాన పాత్రధారులందరినీ కవర్ చేస్తూ తాజాగా ఒక పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు చిత్ర బృందం.

Saaho new poster

అయితే ఈ చిత్రంలో మరో కీలకమైన పాత్రను జాకీ ష్రాఫ్ చేశాడు. వాళ్లందరి లుక్స్ తో వదిలిన ఈ పోస్టర్ అభిమానులను ఆకట్టుకునేలా వుంది. ఈ నెల 10వ తేదీన ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను వదిలే అవకాశం వున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ప్రమోషన్స్ కోసం హీరో ప్రభాస్ సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది. యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ఏ-విక్ర‌మ్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

- Advertisement -