సంపత్‌రెడ్డికి నివాళులు అర్పించిన కేటీఆర్‌

39
- Advertisement -

బీఆర్ఎస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు, జడ్పీ ఛైర్మన్ పాగాల సంపత్ రెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గుండె పోటుతో నిన్న సాయంత్రం సంపత్ రెడ్డి మరణించగా … సంపత్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసానిచ్చారు. సంపత్‌రెడ్డి అకాల మరణం కలిచివేసిందని, ఆయన మృతి పార్టీకి తీరని లోటన్నారు.

తెలంగాణ ఉద్యమ కారుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు సంపత్ రెడ్డి. హనుమకొండలోని తన నివాసంలో చాయ్‌ తాగిన కొద్దిసేపటికే గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. అయితే వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్‌ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జనగామ జిల్లా చిల్పూరు మండలం రాజవరం గ్రామం సంపత్ స్వగ్రామం.

Also Read:Congress:ఛలో ఢిల్లీ..సీఎం లొల్లి?

- Advertisement -