నాయిని నర్సింహారెడ్డి వర్ధంతి.. కేటీఆర్‌ ఘన నివాళి..

35

శుక్రవారం టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్ర‌థ‌మ వర్ధంతి సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఘన నివాళులర్పించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో నాయిని చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారుమంత్రి కేటీఆర్. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొని నివాళులర్పించారు.