‘రాధే శ్యామ్’.. స్టైలిష్‌ లుక్‌లో ప్రభాస్‌..

29

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం రాధే శ్యామ్. రాధా కృష్ణ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదల అయిన లుక్స్ ప్రేక్షకులను ఆకట్టుకోటమే కాకుండా సినిమాపై అంచనాలను పెంచాయి.ఈ క్రమంలో ఈ చిత్రం నుండి తాజాగా మరో పోస్టర్‌ విడుదల చేశారు మేకర్స్‌. దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ప్రభాస్‌ కొత్త లుక్‌ను వదిలాడు. ఈ లుక్‌లో ప్రభాస్ ఎంత స్టైలిష్‌గా ఉన్నాడు.

ప్రభాస్ లేటెస్ట్ పిక్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ఈనెల 23న డార్లింగ్ ప్రభాస్‌ బర్త్ డే. ఈ సందర్భంగా అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో రచ్చ మొదలు పెట్టారు. డార్లింగ్ కామన్ డీపీతో నెట్టింట చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమాల నుంచి వచ్చే అప్డేట్స్ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.