KTR:సత్యమేవ జయతే

27
- Advertisement -

తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన విద్యుత్ కొనుగోళ్లపై నియమించిన కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌కు సుప్రీం కోర్టు షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్స్‌ ద్వారా స్పందించిన కేటీఆర్… రాజకీయ కక్షలు, ప్రతీకారాలకు కొన్ని పరిమితులు ఉంటాయని చెప్పారు.

ప్రతీకారాలకు ఎక్కువ రోజులు చెల్లవని సుప్రీంకోర్టు తాజా నిర్ణయం పునరుద్ఘాటిస్తుందని ..కేసీఆర్‌ మీద అధికార దుర్వినియోగంపై న్యాయస్థానం ప్రతిష్ఠాత్మక తీర్పునిచ్చిందని అన్నారు. త్వరలోనే ప్రజాక్షేత్రంలో కూడా ఇలాంటి తీర్పే రాబోతుందని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాలకు ఆ దేవుడు కూడా తగిన శిక్ష విధిస్తాడని అభిప్రాయపడ్డారు. సత్యమే ఎల్లప్పుడూ గెలుస్తుందని వ్యాఖ్యానించారు.

Also Read:బచ్చల మల్లి .. ఫోక్ మెలోడీ

- Advertisement -