రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ఇద్దరూ కలిసి హైదరాబాద్ మెట్రో అంశంలో డ్రామాలు ఆడుతున్నారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి కేంద్రాన్ని ఏదో అడిగినట్లు, కేంద్రం నుంచి కిషన్ రెడ్డి ఏదో తీసుకువచ్చినట్లు కలిసి ఢిల్లీలో మళ్ళీ నాటకాలు మొదలుపెట్టారని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో అడ్డగోలుగా విమర్శలు చేసుకొని, ఢిల్లీలో కలిసినట్లు నాటకాలు ఆడుతూ కేవలం ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. కానీ ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు చేసిన రేవంత్ రెడ్డిని, మెట్రో విస్తరణకు అనుమతి ఇవ్వని కిషన్ రెడ్డిని ప్రజలు గుర్తుంచుకుంటారన్నారు.
రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో పైన ఉన్న దగ్గర ఉన్న 250 ఎకరాల భూములను తన సొంత అన్నదమ్ములకు, బావమరిదికి, కుటుంబ సభ్యులకు కట్టబెట్టేందుకు రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారన్నారు. కేవలం మెట్రో దగ్గర ఉన్న 30 వేల కోట్ల రూపాయల విలువైన భూములను ఆస్తుల పైన కన్నేసి, మెట్రో రైల్ ఎల్ అండ్ టి అధికారులను బ్లాక్ మెయిల్ చేసి వారిని రాష్ట్రం నుంచి తన్ని తరిమేశారన్నారు. కేవలం తన స్వార్థ ప్రయోజనాల కోసం మెట్రో వేల కోట్ల ఆస్తుల కోసం ప్రైవేట్ సంస్థ అయిన ఎల్ అండ్ టి 14 వేల కోట్ల రూపాయల అప్పును రాష్ట్ర ప్రజల మీద రేవంత్ రెడ్డి రుద్దుతున్నారన్నారు. ఎల్ అండ్ టి కట్టవలసిన అప్పును ఇయ్యాల రాష్ట్ర ప్రభుత్వం కడతామని చెప్పి, మెట్రో రైళ్లను దివాలా తీయించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
మెట్రో పైన ప్రేమ ఉన్నట్లు చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రయత్నం వెనుక ఒక్క భారీ కుంభకోణం ఉన్నదని కేటీఆర్ ఆరోపించారు. మేము ప్రతిసారి రేవంత్ రెడ్డి చేసే కుంభకోణం గురించి ముందే, కుంభకోణాల గురించి ముందే చెప్తూ వస్తున్నామని, ఈసారి కూడా మెట్రో రైలు పేరుతోని రేవంత్ రెడ్డి చేయబోతున్న కుంభకోణం గురించి స్పష్టంగా ప్రజలను అలర్ట్ చేస్తున్నామన్నారు. ఖచ్చితంగా మెట్రో దగ్గర ఉన్న 30 వేల కోట్ల రూపాయల విలువైన భూములను భవిష్యత్తులో ఎవరు కొంటారు, ఎవరు అమ్ముతారు, అవన్నీ చివరికి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు ఎలా చేరుతాయో, అన్ని ప్రజల ముందుకు వస్తాయన్నారు.
నిజంగానే కిషన్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉంటే, ఇప్పుడు చేస్తున్నది డ్రామా కాకుంటే గత ప్రభుత్వం ప్రతిపాదించిన లగ్డీకాపూల్ నుంచి మెట్రో పటాన్చెరువు వరకు ప్రతిపాదిస్తే ఎందుకు బిజెపి ఆమోదం తెలపలేదన్నారు. ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో చిన్న చిన్న మెట్రో నగరాలకు మెట్రో ప్రాజెక్టులు అపనంగా ఇచ్చిన కేంద్రం ఎందుకు తెలంగాణకు మద్దతుగా నిలవలేదన్నారు.
దీనితో పాటు అత్యధిక జనసాంద్రత కలిగిన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు ఎలాంటి భూసేకరణ లేకుండా మెట్రో రైల్ ప్రాజెక్టుని శంకుస్థాపన చేస్తే, రేవంత్ రెడ్డి వచ్చి దానిని వెంటనే రద్దు చేశారన్నారు.గత ప్రభుత్వ ప్రణాళికల హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ ప్రాజెక్టు ఇప్పటికే పూర్తి అయ్యేదని, లక్షల మంది ప్రజలకు ట్రాఫిక్ తిప్పలు తప్పేవని కేటీఆర్ అన్నారు. కేవలం రేవంత్ రెడ్డికి ఆలోచన లేక, పరిపాలన ప్రాధాన్యతలు తెలయక మెట్రో రైల్ ప్రాజెక్టును రద్దు చేశారని కేటీఆర్ మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టి వదిలేసిన హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుని 70 శాతానికి పైగా కేసీఆర్ గారు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారని కేటీఆర్ గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి కలిసి ఎన్ని డ్రామాలు ఆడినా ఖచ్చితంగా హైదరాబాద్ నగరంలో మెట్రో ప్రాజెక్టు మరోసారి పట్టాలు ఎక్కాలి అంటే, ఎక్కాలి అంటే ఖచ్చితంగా కేసీఆర్ తిరిగి రావాల్సిందే అని కేటీఆర్ అన్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి తుగ్లక్ మరియు హిట్లర్ ఆదర్శంగా తీసుకున్నారన్నారు. లక్షల మందిని చంపిన హిట్లర్ ఒకవైపు, పదేపదే తన అజ్ఞానంతో రాజధానిని మార్చి, రాజ్యానికి అనేక ఇబ్బందులు తీసుకువచ్చిన తుగ్లక్ మరొకవైపు రేవంత్ రెడ్డి స్ఫూర్తిగా తీసుకున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.కేవలం తుగ్లక్ ఆలోచన విధానం ఉంది కాబట్టే, గత ప్రభుత్వం ప్రారంభించిన అన్ని రకాల ప్రజా ప్రయోజన ప్రాజెక్టులను, సంక్షేమ పథకాలను రద్దు చేస్తూ, కనీసం తన సొంత ఆలోచన మేరకు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో రేవంత్ రెడ్డి ఉన్నారన్నారు.
Also Read:టీఎంసీ సుప్రీమోగా మళ్లీ మమత?
రేవంత్ రెడ్డికి తుగ్లక్ ఆదర్శం కాబట్టే, అడ్డగోలుగా హైదరాబాద్ నగరంలో లక్షల మంది ఇండ్లను కూలగొట్టి, మూసీ ప్రాజెక్టు పేరుతో అక్రమాలకు తెరలేపారన్నారు. లక్షన్నర కోట్లతో మూసీ చేసేందుకు డబ్బులు ఉంటాయి కానీ, ఇచ్చిన హామీలను డిక్లరేషన్లను, 420 హామీలను అమలు చేయడానికి, గ్యారంటీలను అమలు చేయడానికి మాత్రం డబ్బులు ఉండవని కేటీఆర్ విమర్శించారు.
భారత రాష్ట్ర సమితి తరఫున కార్యకర్తల కష్టంతో గెలిచిన షేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ తన అవినీతి, అక్రమాలను కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌లోకి మారారన్నారు. ఆయననే గతంలో పదేళ్ల బిఆర్ఎస్ కాలంలో ఒక్క షేరిలింగంపల్లి నియోజకవర్గానికి 9500 కోట్ల రూపాయలతో ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులతో ఒక ప్రగతి నివేదికను విడుదల చేశాన, చేసిన విషయాన్ని గుర్తుచేశారు. మరి రెండు సంవత్సరాలలో ఎన్ని డబ్బులు నియోజకవర్గానికి తెచ్చారో ఎమ్మెల్యే గాంధీ చెప్పాలన్నారు.
మళ్ళీ షేరిలింగంపల్లిలో గులాబీ జెండా ఎగరాలి అంటే కార్యకర్తలంతా కలిసికట్టుగా కదం తొక్కాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వ నమోదుతో పాటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ పైన కార్యకర్తలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడు క్యాలెండర్‌లో తేదీలు మారుతాయా, కెసిఆర్ ఎప్పుడు తిరిగి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తారా అని ఎదురుచూస్తున్నారని కేటీఆర్ అన్నారు.

