పేరు మార్చి ఆ పథకాన్ని ప్రవేశపెట్టారు-కేటీఆర్‌

249
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు పథకాన్ని పేరు మార్చి బడ్జెట్‌లో కొత్త పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్ కేటీఆర్‌ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నేడు బడ్జెట్‌లో రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకంపై టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ స్పందించారు. సీఎం కేసీఆర్‌ మానస పుత్రిక అయిన రైతుబంధుతో.. దేశ ప్రజలకు సహాయం అందనుండటం హర్షణీయమన్నారు. అనుకరణకు మించిన ప్రశంస మరొకటి లేదని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు.

KTR

కేటీఆర్‌ ట్వీట్‌పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు. ‘కేసీఆర్‌ పథకాన్ని మోదీ కాపీ పేస్ట్‌ చేశారు. కేసీఆర్‌ మాదిరిగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లే సొంత ఆలోచన, దూర దృష్టి మోదీకి లేవు. రైతు బంధును కేంద్రం అనుసరించడం.. రైతు సమస్యల పరిష్కారంలో కేసీఆర్‌ దూరదృష్టికి అద్దం పట్టాయి. దేశానికి కేసీఆర్‌ నాయకత్వం వహించే సమయం ఆసన్నమైంది’ అని పేర్కొన్నారు.

- Advertisement -