మద్యం అమ్మకాలే ఆదాయ వనరులా?

5
- Advertisement -

నాడు కేసీఆర్ పాలనలో పల్లె, పల్లెకు ప్రగతి రథచక్రాలు… ప్రతి చేనుకు నీళ్లు ప్రతి చేతికి పని అందిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఇంటింటికి తాగునీళ్లు,ఆడబిడ్డలకు తప్పిన ఇబ్బందులు ,నాడు ప్రగతిబాట పట్టిన తెలంగాణను తాగుబోతుల తెలంగాణగా మారుస్తున్నారని నిందలు వస్తున్నాయన్నారు.

నేడు పల్లె, పల్లెలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి మద్యం ప్రియుల బలహీనతను రాష్ట్ర ఖజానాకు ఆదాయ వనరుగా మార్చుకునే కుట్ర…అన్ని రంగాలలో తెలంగాణ ప్రగతిని దెబ్బతీసి .. ఇప్పుడు తీరిగ్గా ఆదాయం కోసం మద్యం అమ్మకాలను నమ్ముకున్న అసమర్థ కాంగ్రెస్ సర్కార్ అని ఆరోపించారు.

ఏడాది క్రితం సగటున ఒక వ్యక్తి మద్యం కోసం చేసే ఖర్చు రూ.897….ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో సగటున ఒక వ్యక్తి మద్యం మీద చేస్తున్న ఖర్చు రూ.1623కు పెరిగింది అన్నారు. లైసెన్స్ గడువు మూడేళ్లకు పెంచి, ధరఖాస్తు ధర రూ.3 లక్షలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. నాడు మద్యం అమ్మకాలపై విమర్శలు …నేడు అధికారం దక్కించుకుని ఆదాయం కోసం మద్యం అమ్మకాలనే నమ్ముకుంది కాంగ్రెస్ సర్కార్ అన్నారు.

Also Read:తెలంగాణ కొంగుబంగారం సింగరేణి

- Advertisement -