ఇవాళ తెలంగాణ కేబినెట్ జరగనుంది. మధ్యాహ్నం 2గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రిమండలి భేటీ కానుంది. మధ్యాహ్నం సచివాలయంలో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, వర్షాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
కులగణనపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక, 42శాతం బీసీ రిజర్వేషన్లపై ఎన్నికల సంఘానికి ఇచ్చే నివేదిక,గోశాలల పాలసీపై ఈ కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
అలాగే నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు అవసరమైన పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. జిల్లాలో మంత్రుల పర్యటనల్లో పరిశీలించిన అంశాలపై మంత్రివర్గంలో చర్చ జరగనుంది. సాగునీటి ప్రాజెక్టుల అంచనాల పెంపుపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Also Read:తెలంగాణ కొంగుబంగారం సింగరేణి

