కొత్త రేషన్ కార్డులు అందుకున్న వారికి గుడ్‌న్యూస్. ఇప్పటికే అమలు చేస్తున్న వివిధ గ్యారంటీలను కొత్త రేషన్ కార్డుదారులకు కూడా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం గ్యారంటీలు, ఆరోగ్యశ్రీ అందేలా రేషన్ కార్డులతో అనుసంధానించనున్నారు.
గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మీ, చేయూత తదితర పథకాలకోసం వీళ్ల నుంచి దరఖాస్తులను తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అధికారులే నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వాళ్ల వివరాలను నమోదు చేయనున్నారు.
Also Read:TTD: ఆగస్టు నెల విశేష ఉత్సవాలు
కొత్తగా రేషన్ కార్డులు పొందినోళ్లు ఆరోగ్యశ్రీ పథకం ప్రయోజనాలను పొందడంలో ఎలాంటి జాప్యం లేకుండా చూసేందుకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఇప్పటికే స్పెషల్ సెల్ ఏర్పాటు చేసింది. ఈ సెల్ కొత్త లబ్ధిదారుల వివరాలను క్రోడీకరించి, వారికి ఆరోగ్య శ్రీ సేవలను సత్వరమే అందేలా చర్యలు తీసుకుంటుంది. ఇప్పటి వరకు కొత్తగా 3.50లక్షలకుపైగా రేషన్ కార్డులు మంజూరు చేసింది.

