కేసీఆర్ రైతుబంధు పాలన రైతులకు స్వర్ణ యుగం అని మల్లొకసారి రుజువైంది అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, ప్రాజెక్టుల వల్ల 2014 నుండి 2023 మధ్య తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి అన్నారు.
2014 లో తెలంగాణలో రైతుల, కౌలుదారులు, రైతు కూలీల ఆత్మహత్యల సంఖ్య 1,347.. అదే 2023లో 56.. అంటే 96% తగ్గుదల…కానీ మళ్ళీ కాంగ్రెస్ రాగానే పరిస్థితి తారుమారైంది.. రెండేళ్లలోనే సుమారు 700కు పైగా అన్నదాతల ఆత్మహత్యలు నమోదయ్యాయి అన్నారు.
మళ్ళీ కేసీఆర్ రావాలి.. రైతులు చల్లగా నూరేళ్లు వర్ధిల్లాలి అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు కేటీఆర్.
కేసీఆర్ రైతుబంధు పాలన రైతులకు స్వర్ణ యుగం అని మల్లొకసారి రుజువైంది.
బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, ప్రాజెక్టుల వల్ల 2014 నుండి 2023 మధ్య తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.
2014 లో తెలంగాణలో రైతుల, కౌలుదారులు, రైతు కూలీల… pic.twitter.com/HXC0e4xSNI
— KTR (@KTRBRS) October 1, 2025
Also Read:కాళేశ్వరం రిపేర్ పనులకు మోక్షం

