- Advertisement -
ఎట్టకేలకు కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్ పనులు మోక్షం లభించింది. తెలంగాణకు జీవదార కాళేశ్వరం ప్రాజెక్టునే అని గుర్తించింది కాంగ్రెస్ ప్రభుత్వం.
మొదటిని నుండి బిఆర్ఎస్ పార్టీ ఇదే చెప్పింది… మేడిగడ్డ, అన్నారం,సుందిళ్ల బారేజీల పునరుద్ధరణ డిజైన్లకు ఆహ్వానం పలికింది. డిజైన్ ఏజెన్సీలను ఎంపిక చేసేందుకు ఆసక్తి పత్రాలు రిలీజ్ చేసింది.
NDSA కమిటీ దర్యాప్తుల ఆధారంగా రిహాబిలిటేషన్ & రెస్టోరేషన్ డిజైన్లు ఫైనల్ చేయనున్నారు. ఆసక్తి పత్రాలు సమర్పణ చివరి తేది: అక్టోబర్ 15, మధ్యాహ్నం 3 గంటల లోపు కాగా అక్టోబర్ 15 సాయంత్రం 5 గంటలకు సీల్ కవర్స్ ఓపెన్ చేయనున్నారు. వివరాలు తెలంగాణ నీటిపారుదల వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండనున్నాయి.
- Advertisement -

