తెలంగాణలో ఒకేరోజు ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అచ్చన్నపేటలో మొగిలి లక్ష్మణ్(45)..మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం పీక్లా తండా లో గూగులోత్ భాస్కర్(40).. హన్మకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో నాలికె అనిల్(29)..ఈ ముగ్గురు రైతుల బలవన్మరణాలకు ముఖ్యమంత్రి రేవంతే పూర్తి బాధ్యుడు అన్నారు.
సీఎం చేతకానితనంతో సృష్టించిన సాగునీటి సంక్షోభంతో బోర్లు వేసి బొక్కబోర్లా పడి ఒకరు ప్రాణాలు తీసుకుంటే.. పెట్టుబడి సాయం లేక ఆర్థిక భారంతో అప్పుల పాలై ఇంకొకరు బలయ్యారు…భారీ వర్షాలతో నష్టపోయిన పంటకు పరిహారం అందక మరొక యువ రైతు కుటుంబాన్ని విషాదంలో ముంచి తనువు చాలించాడు.ఇలా రేవంత్ సర్కార్ తెచ్చిన ఈ వ్యవసాయ సంక్షోభం నుంచి గట్టెక్కలేక అన్నదాతలు వరుసగా తమ నిండు ప్రాణాలు బలితీసుకుంటున్నారు. కేసీఆర్ గారి పదేళ్ల ప్రస్థానంలో రైతుల ఆత్మహత్యలు 96 శాతం తగ్గాయని ఇటీవలే NCRB నివేదిక తేల్చిచెబితే.. మళ్ళీ కాంగ్రెస్ పాలన రాగానే రైతు కుటుంబాల్లో ఈ మరణమృదంగం ప్రమాదఘంటికలు మోగిస్తోంది అన్నారు.
సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు జరిగిన స్థాయిలో మరోసారి తెలంగాణ గడ్డపై రైతుల ఆత్మహత్యలు చోటు చేసుకోవడం విషాదమే కాదు.. ముంచుకొస్తున్న విలయానికి సంకేతం..రైతన్నలారా అధైర్యపడకండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ గారి సారథ్యంలో మళ్లీ వ్యవసాయాన్ని గాడిన పెట్టుకుందాం. అప్పటి వరకు సంఘటితంగా పోరాడదాం. రైతు వ్యతిరేక రేవంత్ సర్కారుకు బుద్ధి చెబుదాం అన్నారు.
తెలంగాణలో ఒకేరోజు ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అచ్చన్నపేటలో మొగిలి లక్ష్మణ్(45)..
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం పీక్లా తండా లో గూగులోత్ భాస్కర్(40)..
హన్మకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో నాలికె… pic.twitter.com/jQpPBXp4HY
— KTR (@KTRBRS) October 8, 2025
Also Read:ఏపీకి భారీ వర్ష సూచన

