తప్పుడు ప్రచారాన్ని నమ్మకండి:విష్ణు

7
- Advertisement -

తిరుప‌తి జిల్లాలో ఉన్న నటుడు మోహన్ బాబు ప్రైవేటు యూనివ‌ర్సీటికి ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ భారీ జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించారు మంచు విష్ణు.

మీడియాలో వ‌స్తున్న వార్త‌ల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని కావాల‌ని త‌ప్పుడూ ప్ర‌చారం చేస్తున్న‌ట్లు తెలిపారు. మోహన్‌బాబు విశ్వవిద్యాలయం కు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ (APHERMC) చేసిన సిఫార్సులపై వివిధ మీడియా మాధ్యమాలలో జరుగుతున్న ప్రచారాన్ని ఉద్దేశించి యూనివర్సిటీ వైస్-ఛైర్మన్ మంచు విష్ణు ఒక ప్రకటన విడుదల చేశారు.

యూనివర్సిటీ ప్రతిష్ఠను దిగజార్చడానికి ఉద్దేశపూర్వకంగా ఎంపిక చేసిన సమాచారాన్ని మీడియాలో ప్రచారం చేస్తున్నారని మంచు విష్ణు ఆరోపించారు. ఇటువంటి నిరాధారమైన వార్తలను నమ్మవద్దని ఆయన తల్లిదండ్రులకు మీడియాకు విజ్ఞప్తి చేశారు. విచారణ సమయంలో మోహన్ బాబు యూనివర్శిటీ బృందం పూర్తిగా సహకరించిందని అదే కమిషన్ తన నివేదికలో పేర్కొనడం చూస్తే ఎలాంటి తప్పు జరగలేదనే విషయం స్పష్టంగా తెలుస్తోంది అని ఆయన అన్నారు. తమకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ వస్తున్న వేలాది తల్లిదండ్రులకు విద్యార్థులకు హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు.

Also Read:ఏపీకి భారీ వర్ష సూచన

- Advertisement -