- Advertisement -
ఏపీలో రానున్న మూడు గంటల్లో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ. కోనసీమ, అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
శ్రీకాకుళం,విజయనగరం, అల్లూరి,పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని…ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.
Also Read:గురుకులాల్లో మరణ మృదంగం ఆపలేరా?
- Advertisement -

