KTR:దానంపై వేటు..‘సత్యమేవ జయతే’

8
- Advertisement -

ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్‌ను తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ద్వారా అనర్హుడిగా ప్రకటించింది. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఆయన ఎమ్మెల్యే పదవిని రద్దు చేస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. గతంలో బీఆర్ఎస్, బిజెపి దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేస్తూ అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు తోసిపుచ్చింది.

రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ నిబంధనల ప్రకారం, స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నందుకు దానం నాగేందర్‌ను 2024 ఏప్రిల్ 23వ తేదీ నుండి అమలులోకి వచ్చేలా ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటిస్తున్నట్లు హైకోర్టు తీర్పు ఇచ్చింది. పిటిషన్లను తిరస్కరిస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయం చట్టబద్ధమైనది కాదని కోర్టు స్పష్టం చేసింది.

Also Read:దానం నాగేందర్‌పై అనర్హత వేటు

పార్టీ మారిన ఇతర ఎమ్మెల్యేలపై కూడా త్వరలోనే ఇలాంటి నిర్ణయాలే వెలువడతాయని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగాన్ని, ప్రజా తీర్పును కాలరాసే చర్యలకు కోర్టుల ద్వారా తగిన బుద్ధి చెప్పడం ఖాయమని తెలిపారు . సత్యమేవ జయతే’ అని ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్.. రాబోయే రోజుల్లో ఇతర పార్టీ ఫిరాయింపుదారులందరికీ కూడా ఇదే విధమైన షాక్ తప్పదని స్పష్టం చేశారు.

 

- Advertisement -