- Advertisement -
ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులు, నిధుల విడుదలపై చర్చించారు. దీంతో పాటు రంగారెడ్డి జిల్లాలో ఫార్మా సిటీ ఏర్పాటుకు సహకారం అందించాలని పీయూష్‌ని కోరారు.
నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానిఫ్యాక్చరింగ్ జోన్ కింద ఫార్మా సిటీ ఏర్పాటులో మౌలిక సదుపాయాల కల్పనకు DPIIT కింద నిధులు సమకూర్చలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు.
ఖమ్మం జిల్లాలో గ్రానైట్ రవాణా కోసం రైల్వే సైడింగ్ సదుపాయం కల్పించాలని కోరారు. రైల్వే సైడింగ్ సదుపాయంతో గ్రానైట్ రవాణాతో పాటు సిమెంట్, ఇనుము, పండ్ల రవాణా సులభమవుతుందని తెలిపారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు నల్గొండ మీదుగా రోజువారీ ప్యాసింజర్ రైలు నడపాలని వినతిపత్రం అందించారు. ఈ సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
- Advertisement -