సివిల్ సప్లై కమిషనర్‌గా సత్యనారాయణ రెడ్డి..

400
p satyanarayana reddy

తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌, పౌరసరఫరాల సంస్థ వైస్‌ ఛాన్సలర్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి పి.సత్యనారాయణ రెడ్డి గురువారం నియమితులైయ్యారు. ఈ సందర్భంగా పౌరసరఫరాల భవన్‌లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర సర్వీసులకు వెళ్తున్న డా. అకున్‌ సబర్వాల్‌, ఐపీఎస్‌ ఆయనకు బాధ్యతలను అప్పగించారు.

బాధ్యతలు చేపట్టిన అనంతరం కమిషనర్‌ పి.సత్యనారాయణ రెడ్డి పౌరసరఫరాల శాఖ, పౌరసరఫరాల సంస్థ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. రానున్న ఒకటి రెండు రోజుల్లో ప్రతి విభాగాన్ని పూర్తిస్థాయిలో సమీక్షిస్తానని తెలిపారు. ప్రధానంగా ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోళ్లపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.