కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.సీనియర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య పట్ల రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు బాధాకరం అన్నారు.
బలమైన బీసీ నాయకుడు అని కూడా చూడకుండా.. పొన్నాల లక్ష్మయ్యని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తూలనాడిన విధానాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. ఇక రేపు సీఎం కేసీఆర్‌ని కలవనున్నారు పొన్నాల.
దేశంలో వ్యవసాయం తరువాత ఎక్కువ మందికి ఉపాధి చూపిస్తున్న చేనేత రంగాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు. రెక్కాడితేగాని డొక్కాడని నేతన్నలపై కాఠిన్యం ప్రదర్శించింది. ప్రధాని మోదీ పాలనలో కొత్త పథకాలేవీ ప్రకటించకపోగా, ముడి సరుకు ధరలను విపరీతంగా పెంచి.. పన్నుల భారం మోపడంతో చేనేత రంగం నిర్వీర్యం అయ్యిందన్నారు.
Also Read:కృష్ణారామా చాలా ప్రత్యేకమైన చిత్రం:రాజేంద్ర ప్రసాద్