CAPF:కేటీఆర్ లేఖతో దిగొచ్చిన కేంద్రం…!

26
- Advertisement -

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగార్థులకు శుభవార్త. గతంలో కేంద్ర సాయుధ బలగాలలో నియమాకాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే వెంటనే ప్రాంతీయ భాషల్లో పరీక్షలను నిర్వహించాలన్న తెలంగాణ మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌కు కేంద్రం తలొగ్గింది.

హిందీ ఇంగ్లీష్‌ భాషలతో పాటు 13ఇతర ప్రాంతీయ భాషల్లోనూ పరీక్షలను నిర్వహించేందుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తెలుగు, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మలయాళం, కన్నడ, తమిళం, ఒడియా, ఉర్దూ, పంజాబీ, మణిపురి, కొంకణి భాష‌ల్లో 2024 జనవరి 1 నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం త‌న‌ ప్రకటనలో పేర్కొన్న‌ది.

మంత్రి కేటీఆర్ గతంలోనే కేంద్రంకు పలుమార్లు లేఖలు రాసిన సంగతి తెలిసిందే. కేవలం హిందీ ఇంగ్లీష్ భాషల్లో పరీక్షలను నిర్వహించడం వల్ల ప్రాంతీయులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పలుమార్లు ప్రధానికి దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. కేంద్ర బలగాల నోటిఫికేషన్లు ప్రజల హక్కుల్ని హరిస్తోందని రాజ్యాంగం ఇచ్చిన సమానత్వ అవకాశాలను ఇతర ప్రాంత ప్రజలు కోల్పోతున్నట్టు కేటీఆర్ తన లేఖలో పేర్కొన్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి…

ఫుడ్ పాయిజన్ అయితే.. ఇలా చేయండి!

HARISHRAO:నిజామాబాద్‌ ఘటనపై విచారణకు ఆదేశం

కులాంతర వివాహం చేసుకునే వారికి.. అద్భుత పథకం!

- Advertisement -