మంత్రులు చేసే తప్పులకు మీరు బలి కాకండి అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. ఐఏఎస్ అధికారులకు రిక్వెస్ట్ చేశారు. ఇవాళ రిజ్వి గారు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే పరిస్థితి వచ్చింది అన్నారు.
నేను అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను.. మీరు రేవంత్ రెడ్డి లేదా ఇంకో మంత్రి చేసే అరాచకాలకు వత్తాసు పలికితే తప్పకుండా మీకు కూడా శిక్ష తప్పదు…సీఎం, మంత్రులు చేసే అరాచకాల్లో మేము ఉండమని చెప్పి అధికారులు భయపడుతున్నారు అన్నారు. ఈ మూటల కొట్లాటల్లో మేము ఎందుకు తల దూర్చాలని అధికారులు పారిపోతున్నారు అంటేనే అర్థం చేసుకోండి అన్నారు.
రేవంత్ రెడ్డి తమ్ముడు మంచిరేవులలో దేవాదాయ శాఖకు చెందిన 600 కోట్ల భూములను కబ్జా చేయాలని చూస్తున్నాడు… ఈ భూముల గురించి మంత్రి కొండా సురేఖ ఫైల్ మీద సంతకం పెడితే, రేవంత్ రెడ్డి జపాన్‌లో ఉండి ఆపించాడు… అసలు రేవంత్ రెడ్డి అన్నదమ్ములకు పోలీస్ ఎస్కార్ట్ ఎందుకు అని మంత్రి కొండా సురేఖ కూతురే అంటుంది అన్నారు.
సొంత ప్రభుత్వంపై మంత్రి కూతురే ఇన్ని ఆరోపణలు చేస్తుంటే వీళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా అసలు? … స్వయంగా మంత్రి గారి కుమార్తెనే నిన్ను పట్టుకొని తుపాకీ ఇచ్చావు అన్న తర్వాత.. సిగ్గు, ఇజ్జత్ ఉంటే ఆమె మాట్లాడేది తప్పని రేవంత్ రెడ్డి చెప్పాలి లేదా నువ్వు మాట్లాడేది తప్పు అని చెప్పి మంత్రిని తీసి పడేయాలి..ఇలాంటి పనికిమాలిన చెత్త ముఖ్యమంత్రిని నేను ఎక్కడా చూడలేదు అన్నారు కేటీఆర్.
Also Read:ప్రభాస్-హను రాఘవపూడి..ఫౌజీ

