భారత్‌ – రష్యా చమురు కొనుగోలుపై ట్రంప్

8
- Advertisement -

భారత్ – రష్యా చమురు కొనుగోలుపై ట్రంప్ మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేశారు. భారతదేశం ఈ సంవత్సరం చివరినాటికి రష్యా చమురు కొనుగోలు ఆపేస్తుంది…ఇందుకు సంబంధించి మోదీతో చర్చించానని తెలిపారు ట్రంప్.

భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తానే ఆపినట్టు పునరుద్ఘాటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆ తాత్కాలిక శాంతి ఒప్పందం సాధించడంలో సుంకాల (టారిఫ్‌ల) పాత్ర కీలకమని అన్నారు. కొన్ని రోజుల క్రితం ట్రంప్ ఇదే అంశంపై వ్యాఖ్యానిస్తూ, మోదీ తనకు ఫోన్‌లో భారతదేశం రష్యా చమురు కొనుగోలు ఆపుతుందని హామీ ఇచ్చారని చెప్పగా, విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ఆ ప్రకటనను ఖండించింది.

భారత్, పాకిస్తాన్ యుద్ధం చేయాలనుకుంటే అది వారికే సంబంధించిన విషయం, కానీ వారు సుంకాలు చెల్లించాల్సిందే. రెండు రోజుల తరువాత వారు ఫోన్ చేసి యుద్ధం చేయబోమని చెప్పారు. సుంకాలే చాలా ముఖ్యం అని చెప్పారని ట్రంప్ వెల్లడించారు.

అమెరికా … బుధవారం రష్యా యొక్క రెండు అతిపెద్ద చమురు కంపెనీలు — రోస్నెఫ్ట్ (Rosneft) మరియు లూకోయిల్ (Lukoil) — పై ఆంక్షలు విధించింది. ఇది రష్యాను ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు ఒప్పించాలనే ఉద్దేశంతో తీసుకున్న చర్యగా అమెరికా ఖజానా శాఖ తెలిపింది. ఈ చర్య రష్యా ఆర్థిక వ్యవస్థలో కీలకమైన ఇంధన రంగాన్ని లక్ష్యంగా చేసుకుని, ఆ దేశం తన సైనిక కార్యకలాపాలకు నిధులు సమకూర్చే సామర్థ్యాన్ని బలహీనపరచడమే లక్ష్యంగా ఉందని వెల్లడించింది.

Also Read:‘కాంత’ ..క్లాస్ రొమాంటిక్ మెలోడీ

- Advertisement -