ప్రభాస్-హను రాఘవపూడి..ఫౌజీ

8
- Advertisement -

ప్రభాస్-హను రాఘవపూడి సినిమా టైటిల్ అనౌన్స్ అయింది. ఇవాళ ప్రభాస్ పుట్టినరోజు నేపథ్యంలో కొత్త సినిమా టైటిల్ ప్రకటించారు. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా రానుండగా ఈ చిత్రానికి ‘ఫౌజీ’ అనే టైటిల్ ఖరారు చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు.

ఈ సినిమాను ప్రఖ్యాత పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. టి సిరీస్‌ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రీ రిలీజ్ పోస్టర్ అందరిని ఆకట్టుకుంది.

బ్రిటిష్ పాలన కాలంలో నడిచే ఒక ఎపిక్ హిస్టారికల్ డ్రామాకు టోన్ సెట్ చేస్తోంది. పోస్టర్‌లో ప్రభాస్‌ లాంగ్ కోట్, బూట్స్ వేసుకుని, ఒక కాలు మరో కాలిపై వేసుకుని నిలబడి ఉన్నట్లు కనిపించారు. వెనుక గోడపై కనిపించే సైనికుల సిల్హౌట్స్ యుద్ధం, తిరుగుబాటు వాతావరణాన్ని చూపిస్తున్నాయి. “A Battalion Who Walks Alone”, “Most Wanted Since 1932” పోస్టర్‌పై ఉన్న ఈ వాక్యాలు ప్రభాస్ పవర్ ఫుల్ పాత్రని సూచిస్తున్నాయి. బ్యాక్ డ్రాప్ లో యూనియన్ జాక్ జెండా బ్రిటిష్ పాలనా కాలాన్ని గుర్తు చేస్తుంది. పోస్టర్‌లో ఉన్న భగవద్గీత శ్లోకాలు ఈ కథకు ఫిలాషఫికల్ డెప్త్ ని యాడ్ చేస్తున్నాయి.

ప్రభాస్ సరసన హీరోయిన్‌గా ఇమాన్వీ నటిస్తోంది. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భాను చందర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Also Read:అమెజాన్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్

- Advertisement -