కేటీఆరే నా హీరో…ఇన్స్పిరేషన్‌:ఎంపీ కవిత

240
kavitha ktr
- Advertisement -

మంత్రి కేటీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించింది ఎంపీ కవిత. నిజామాబాద్‌లో కేటీఆర్‌తో కలిసి ఐటీ హబ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కవిత… మా అన్నే నాకు హీరో…నా ఇన్స్పిరేషన్‌ అని తెలిపింది. అన్నిపట్టణాలకు ఐటీని విస్తరిస్తూ కేటీఆర్‌ ఎంతో శ్రమిస్తున్నారని తెలిపింది. ఐటీ హబ్ విద్యార్థుల భవిష్యత్‌ కోసమేనని…నిజామాబాద్ ఐటీ హబ్ నుండి వాట్సాప్‌ లాంటి ఆవిష్కరణలు రావాలని ఆకాంక్షించింది.

ఎన్నికల కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం లేదని భవిష్యత్ తరాల కోసం పనిచేస్తున్నామని స్పష్టం చేసింది. ఐటీ హబ్‌లో భాగస్వామ్యం అవుతున్న ఎన్నారైలకు కృతజ్ఞతలు తెలిపింది.

kavitha ktr

నిజామాబాద్ జిల్లాలో ఎయిర్ పోర్టు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దం చేశామని వెల్లడించింది. దీంతో మహిళల కోసం ప్రత్యేక స్టేడియం నిర్మిస్తున్నామని…రూ. 25 కోట్లతో బస్ టెర్మినల్ ఏర్పాటు చేస్తామని తెలిపింది. రూరల్ ఆఫ్ షోర్ బీపీవో త్వరలో నిజామాబాద్ జిల్లాకు రాబోతోందని ఈ నెల 30న ఆ ప్రారంభోత్సవానికి రావాలని కేటీఆర్‌ ని ఆహ్వానించామని తెలిపింది. ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటి ట్విట్టర్‌ అకౌంట్‌కి ట్యాగ్ చేయాలని సూచించింది.

- Advertisement -