రామన్నకు రాఖీ కట్టిన కవితక్క..

290
kavitha k
- Advertisement -

అనురాగ బంధాల్ని, ప్రేమానురాగాల్ని బలోపేతం చేసే అపురూప పర్వదినం రాఖీ పౌర్ణమి. శ్రావణ మాసంలో వచ్చే శుభకర వేడుకల్లో, రక్షాబంధనం రమణీయం. నిండు పున్నమివేళ సిరివెన్నెల కురిసే శ్రావణ పూర్ణిమనాడు, ఈ బంధనంలో మమతల మధురిమలు వెల్లివిరుస్తాయి. సామరస్య సంతోషాలు సోదర సోదరీమణుల మధ్య వ్యక్తమవుతాయి. ఉత్తర భారతంలో విశేష వ్యాప్తి చెందిన ఈ సంబరం, కాలక్రమంలో దేశమంతటా విస్తరించింది. సోదరులు క్షేమంగా ఉండాలని ఆక్షాంక్షిస్తూ ఆడపడుచులు రాఖీని కడుతారు.

ఇక మంత్రి కేటీఆర్ ఇంట్లో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. కేటీఆర్‌కు ఆయన సోదరి,మాజీ ఎంపీ కవిత రాఖీ కట్టగా..కేటీఆర్ ఆమెను ఆశీర్వదించారు.  

- Advertisement -