దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో పాల్గోంటున్న మంత్రి కెటి రామారావు రెండో రోజు పలు ప్రముఖ కంపెనీలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశాల్లో అయా కంపెనీలను తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానం, తెలంగాణలోని పెట్టుబడుల అనుకూల వాతావరణాన్ని మంత్రి వారికి వివరించారు. ఉదయం ఏయిర్ ఏషియా గ్రూప్ సియివో అంతోనీ ఫెర్నాండెస్, ఉప కార్యనిర్వహానధికారిణి ఏయిరీన్ ఒమర్‌తో మంత్రి సమావేశం అయ్యారు. దేశంలో రానున్న రోజుల్లో విమానయాన రంగం మరింత అభివృద్ది చెందుతుందన్నారు. హైదరాబాద్‌లోని విమానాశ్రయం అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులు గెలుచుకున్నదని తెలిపారు.
నోవార్టిస్ కంపెనీ పబ్లిక్ పాలసీ హెడ్ పెట్రా లక్స్ తో మంత్రి సమావేశం అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఫార్మసిటీ గురించి వివరించారు. నగరం ఇప్పటికే భారతదేశ లైఫ్ సైన్సెస్ క్యాపిటల్ గా ఉన్నాదన్నారు. నగరంలో నొవార్టిస్ కార్యకలాపాల విస్తరణపైన ఈ సమావేశంలో చర్చ జరిగింది. నోవార్టిస్ కు నగరంలో అర్ అండ్ డి, డాటా సపోర్ట్ మరియు అనాలిటిక్స్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నదని, హైదరాబాద్ నగరంలో సంస్ధ అభివృద్ది పట్ల తాము సంతృప్తిగా ఉన్నామని లక్స్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న 90 వేల చదరపు అడుగుల ల్యాబోరేటరీని రెట్టింపు చేయనున్నట్లు, కొత్తగా సూమారు మరో 150 మంది పరిశోధన సిబ్బందిని నియమించుకోనున్నట్లు తెలిపారు. కంపెనీ కార్యకలాపాల విస్తరణ ద్వారా నగరంలోని జినోమ్ వ్యాలీ అభివృద్దికి ఎంతగానో దోహదం చేస్తుందని, పూర్తి వివరాలను నోవార్టిస్ త్వరలోనే అందిస్తుందని మంత్రి కెటి రామారావు తెలిపారు.
మిత్సుబిషి హెవీ ఇండస్ర్టీస్ కార్యనిర్వహాక ఉపాద్యక్షులు కెన్ కవాయి బృందంతో సమావేశం అయ్యారు. తమ కంపెనీ భారీ ప్రాజెక్టుల అవకాశాల కోసం చూస్తుందని మంత్రికి వారు తెలిపారు. ముఖ్యంగా పారిశ్రామిక వాడలు, వేస్ట్ మేనేజ్ మెంట్ ప్రాజెక్టులు తదితర ప్రాజెక్టులపైన మిత్సుబిషికి ఆసక్తి ఉన్నట్లు తెలిపారు. ఇలాంటి ప్రాజెక్టుల నిర్మాణానికి తమ రాష్ర్టంలో అనేక అవకాశాలున్నాయని, కంపెనీ ప్రతినిధి బృందం స్వయంగా తెలంగాణలో పర్యటించాలని మంత్రి కోరారు. మిత్సుబిషి ముందుకు వచ్చి జపనీస్ స్మాల్ అండ్ మిడియం ఎంటర్ ప్రైజేస్ పార్క్ ను తెలంగాణలో ఎర్పాటు చేయాలని కోరారు. మొన్నటి జపాన్ పర్యటనలో ఇలాంటి పార్కు ఎర్పాటుకు జైకా వంటి అర్ధిక సంస్ధలు నిధులు అందించేందుకు సూత్రప్రాయంగా ఒప్పుకున్నాయని మంత్రి వారికి తెలిపారు.
కువైట్కు చెందిన ఫవద్ అల్గానిమ్ కంపెనీ సియివోతో మహ్మమద్ అల్గానిమ్ తో మంత్రి సమావేశం అయ్యారు. తెలంగాణ ఇప్పటికే సోలార్ విద్యుత్పాదనలో అగ్రస్ధానంలో ఉందన్నారు. ఈ రంగానికి తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని మంత్రి వివరించారు. రాష్ర్టంలో పవర్, మెడికల్ డివైజేస్ మాన్యూఫాక్చరింగ్ రంగాల్లో ఉన్న పెట్టుబడుల అవకాశాలను వివరించారు. ఇన్వెస్ట్ మెంట్ కార్పోరేషన్ అప్ దుబాయ్ సియివో మహ్మమద్ అల్ షయిభానీతో మంత్రి సమావేశం అయ్యారు. తెలంగాణలో టెక్ సెంటర్ ఎర్పాటు చేయాలని కోరారు. దీంతోపాటు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పలు ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఈ సమావేశంలో చర్చించారు.
హ్యూలెట్ ప్యాకర్ఢ్ (హెచ్ పి) సంస్ధ ఉపాద్యక్షులు అనా పిన్కుజుక్ తో సమావేశం అయ్యరు. హెచ్ పి మరియు టి హబ్ ల భాగాస్వామ్యానికి ఉన్న అవకాశాలను పరిశీలించాల్ని మంత్రి పిన్యూజుక్ ను కోరారు. దీంతోపాటు నగరంలో హెచ్ పీ కార్యాకలాపాలను విస్తరించాలని విజ్ఝప్తి చేశారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో సర్కూలర్ అవార్డు గెలుచుకున్న టిహబ్ సంస్ధ బనయన్ నేషన్ సహా వ్యవస్ధాపకుడు మని వాజిపేయ్ మంత్రిని కలిసారు. ఈ సందర్భంగా మంత్రి కెటి రామరావు మని బృందానికి అభినందనలు తెలిపారు. టి హబ్ సంస్ధకు ప్రపంచ గుర్తింపు దక్కడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు.