తెలంగాణ సాధించుకున్నాక రాష్ట్రంలో పెట్టుబడుల వరద కొనసాగుతుంది. తాజాగా ఫ్రాన్స్ కు చెందిన సాఫ్రాన్ సంస్థ పెట్టుబడులు పెట్టడానికి హైదరాబాద్‌ను ఎంచుకున్నందుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ని కనబరుస్తాయని తెలిపారు. ఈ క్రమంలోనే రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చిందన్నారు. సాఫ్రాన్ గ్రూప్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించిందని….దీంతో సాఫ్రాన్ గ్రూప్ నిర్ణయాన్ని మంత్రి కేటీఆర్ స్వాగతించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో మెగా ఏరో ఇంజిన్ మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాల్ (ఎమ్‌ఆర్వో) ఏర్పాటుకు సాఫ్రాన్ నిర్ణయించిందన్నారు. హైదరాబాద్‌లో సాఫ్రాన్ ఏర్పాటు చేసే ఎమ్‌ఆర్వో ప్రపంచంలోనే పెద్దది అని తెలిపారు. ప్రపంచ స్థాయి సంస్థ భారత్‌లో ఏర్పాటు చేసే మొదటి ఇంజిన్ ఎంఆర్ఓ అని పేర్కొన్నారు. భారతదేశంలో ఒక విదేశి సంస్థ తొలి విమాన ఇంజన్ల నిర్వహణ కేంద్రం హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. పౌర, సైనిక విమానాల కోసం అధునాతన ఇంజన్లును ఉత్పత్తి చేసే అగ్రశేణుల్లో ఒకటైన సాఫ్రాన్ ఒకటన్నారు మంత్రి కేటీఆర్. ఎంఆర్ఓ, ఇంజిన్ టెస్ట్ సెల్ పెట్టుబడి దాదాపు రూ. 1,200 కోట్లు (15 కోట్ల అమెరికన్ డాలర్ల) అని తెలిపారు. ఒక వెయ్యి మందికి ఉపాధి లభిస్తుందన్నారు.
భారత్‌తో పాటు విదేశి వాణిజ్య విమానాయన సంస్థల విమానాల్లో వాడే లీప్-1ఏ, లీప్-1బీ ఇంజన్ల నిర్వహణలు కేవలం విదేశాల్లో ఉండగా మొదటిసారి హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నందకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఏరోస్పేస్ హాబ్‌గా హైదరాబాద్ మారబోతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.