సంక్షోభంలో బోరిస్‌ సర్కార్‌ … ఇద్దరు మంత్రుల రాజీనామా

34
britan
- Advertisement -

బోరిస్‌ జాన్సన్‌ ప్రభుత్వం మరింత ఉబిలోకి దిగజారుతొంది. తాజాగా తన కెబినెట్‌లోని ఇద్దరు మంత్రులు రాజీనామా చేశారు. విల్‌ క్విన్‌, లారా ట్రాట్‌. గతంలోనే ఆర్థిక మంత్రి రిషి సునాక్‌, ఆరోగ్య మంత్రి సాజిద్‌ జావిద్‌ రాజీనామా చేశారు. ప్రధాని కూడా వైదొలగలాని వారు డిమాండ్ చేశారు

గతంలోనే కరోనా కాలంలో తన అధికార నివాసంలో పార్టీ చేసుకున్నందుకు దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. 2019లో ప్రధాని జాన్సన్‌ క్రిస్‌ ఫించర్‌ను ప్రభుత్వ డిప్యూటీ చీఫ్ విప్‌గా నియమించడంతో వివాదంలో చిక్కుకున్నారు. అప్పటికే అతని నడవడికపై పలు ఆరోపణలున్నాయి కాని ఆవేం పట్టించుకొకుండా క్రిస్‌ ఫించర్ ను కీలక పదవిలో కూర్చోబెట్టాడు. క్రిస్ ఫించర్‌ గురించి బొరిస్‌కు ముందుగానే చెప్పామని సీనియర్‌ ఆధికారి ఒకరు తెలిపారు.

శిశు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విల్‌క్వీన్‌ బుధవారం ట్విటర్‌ వేదికగా తన రాజీనామాను ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితులలో పదవి నుంచి వైదొలగడం కంటే తనకు మరో దారి లేదన్నారు. ఈ ప్రకటన వెలువడిన కొంత సేపటికే రవాణా శాఖ మంత్రి లారా ట్రాట్ కూడా తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. బోరిస్‌ ప్రభుత్వం మీద తనకు విశ్వాసం పోయిందన్నారు. ఆందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలపారు. తాజా పరిస్థితులలో బోరిస్‌ ప్రభుత్వం మరింత చిక్కుల్లో పడింది.

- Advertisement -