KTR: కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

6
- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ఆసక్తికర ట్వీట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేసీఆర్ గారి పాలనలో సాగుకు స్వర్ణయుగం.. కాంగ్రెస్ రాగానే వ్యవసాయానికి గడ్డుకాలం.. అని పేర్కొన్నారు. ఇది కాంగ్రెస్ సర్కార్ చేసిన.. కమాల్,తెలంగాణలో సాగు విస్తీర్ణం కళ్ళముందే.. ఢమాల్,ఒక్క ఏడాదిలోనే..
15.30 లక్షల ఎకరాల్లోతగ్గిన సాగు విస్తీర్ణం..ఆగమైతున్న తెలంగాణ రైతు బతుకుకు.. తొలి ప్రమాద సంకేతం..! అన్నారు.

దశాబ్ద కాలంలోనే.. దేశానికే అన్నపూర్ణగా ఎదిగిన తెలంగాణలో..ఎనిమిది నెలల్లోనే..ఎందుకింత వ్యవసాయ విధ్వంసం..? అని ప్రశ్నించారు. సంతోషంగా సాగిన సాగులో.. ఎందుకింత సంక్షోభం..??,మొన్న.. వ్యవసాయానికి కరెంట్ కట్ ,నిన్న.. రుణమాఫీలో రైతుల సంఖ్య కట్,నేడు.. సాగయ్యే భూమి విస్తీర్ణం కట్ అని దుయ్యబట్టారు.

రుణమాఫీ అని మభ్య పెట్టి..పెట్టుబడి సాయన్ని ఎగ్గొట్టడం వల్లే రైతులకు ఈ అవస్థ..రూ.500 బోనస్ అని..నిలువునా మోసం చేసింది ఈ కాంగ్రెస్ వ్యవస్థ..
ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నయ్..కానీ చేతలు సచివాలయం గేటు దాటడం లేదు..ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు..అన్నదాతలది అత్యంత దయనీయ పరిస్థితి..కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకునే విజన్ లేదు..రిజర్వాయర్లు నింపే ప్రణాళిక లేదు..చెరువులకు మళ్లించే తెలివి లేదు అన్నారు.

Also Read:ఎండు ద్రాక్షతో.. మహిళలకు ఆరోగ్యం!

- Advertisement -