మెట్రోకు అనూహ్య స్పందన..

229
Ktr inaugurates CBREN Office
- Advertisement -

హైదరాబాద్ మెట్రోకు అనూహ్య స్పందన వస్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు.  రాయదుర్గం సొలపురియా నాలెడ్జ్ సిటీ పార్క్‌లో ప్రముఖ రియల్ ఎస్టేట్, ఆర్థిక సేవల సంస్థ సీబీఆర్‌ఈ కార్పొరేట్ కేంద్రాన్ని ప్రారంభించిన కేటీఆర్…ఢిల్లీ, బెంగళూరు, చెన్నై కంటే హైదరాబాద్ సురక్షితమైన నగరమని స్పష్టం చేశారు.

మెట్రో రైలులో రోజుకూ లక్ష మందికి పైగా ప్రయాణం చేస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే ఏడాదిలో మెట్రోను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామని మంత్రి చెప్పారు. మెట్రో మొదటి దశతో పెట్టుబడిదారులకు మరిన్ని అవకాశాలు వచ్చాయన్నారు. నూతన పారిశ్రామిక విధానం వల్ల పెట్టుబడులు అనేకం వచ్చాయన్నారు. దీని వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి దొరుకుతుందన్నారు.

హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్‌కు భారీ డిమాండ్ ఉందన్నారు. ఆఫీస్ స్పేస్ అబ్జార్షన్‌లో నగరంలో మంచి అభివృద్ధి సాధిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఆఫీస్ స్పేస్ విషయంలో 2015తో పోల్చితే 2017లో డిమాండ్ రెట్టింపు అయిందన్నారు. భౌగోళిక పరంగాను హైదరాబాద్ ప్రపంచంలోనే బెస్ట్ సిటీ అని చెప్పారు. 19 వేల ఎకరాల్లో ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మా క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు.

- Advertisement -