కమెడియన్ విజయ్ ఆత్మహత్య..

218
Vijay Commits Suicide
- Advertisement -

అమ్మాయిలు అబ్బాయిలు సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన కమెడియన్ విజయ్ మృతి చెందారు. హైదరాబాద్‌లోని  యూసుఫ్ గూడలో తన సొంత ఫ్లాట్ లో ఆత్మహత్య చేసుకున్నాడు.  సినిమాల్లో అవకాశాలు లేకపోవడం, ఎంతగా శ్రమించినా బ్రేక్ రాకపోవడంతోనే విజయ్ ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం. విజయ్ కొంతకాలంగా డిప్రెషన్ తో బాధపడుతున్నాడని స్నేహితులు వెల్లడించారు.

బొమ్మరిల్లులో ‘పిచ్చెక్కిస్తా’ అని విజయ్ చెప్పిన డైలాగులు ప్రేక్షకులకు ఎప్పటికి గుర్తుండిపోతాయి. విజయ్ మృతితో టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. విజయ్ స్నేహితులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సినిమా అవకాశాల కోసం గత కొంతకాలంగా విజయ్, ప్రొడక్షన్ హౌస్ ల చుట్టూ తిరుగుతున్నాడని సన్నిహితులు వెల్లడించారు.

Comedian-Vijay-01

- Advertisement -