దుబ్బాక అభివృద్ధి నా బాధ్యత- మంత్రి హరీష్‌

305
harish rao
- Advertisement -

సిద్దిపేట జిల్లా దుబ్బాక వైశ్య సధనంలో బతుకమ్మ, దసరా సందర్భంగా వైశ్య సంఘం ఆధ్వర్యంలో అలయ్ బలయ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్‌ రావు,దుబ్బాక టిఆర్ఎస్ అభ్యర్థి సుజాత, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్త బిగాల, ఇంటర్నెశనల్ ఆర్యవైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర గుప్త తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ.. ఎన్నికలు వస్తాయి, పోతాయి ప్రజల కష్టసుఖాల్లో ఎవరు నిరంతరం ఉంటారో చూడాలి. రామలింగారెడ్డి గెలుపులో సుజాత కృషి ఎంతో ఉంది అన్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పని చేసినా అతి సాధారణ జీవితం వారిది. హుజూర్ నగర్‌లో గెలిచిన తరువాత 300 కోట్లు కేసీఆర్ సాంక్షన్ చేశారు. టిఆర్ఏస్ గెలిస్తే ఏమిస్టదని అంటున్న వారికి ఈ అభివృద్దే సాక్ష్యం. దుబ్బాక అభివృద్ధి బాధ్యత నాదీ.. అని మంత్రి హామీ ఇచ్చారు.

నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో అభివృద్ధి చేస్తామని చెప్పాము… గతంలో ఎన్నడూ లేని అభివృద్ధి చేసి చూపించాం. సుజాత నాకు దేవుడిచ్చిన సోదరి.. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో దుబ్బాక అభివృద్ధి భాద్యత నేను తీసుకుంటున్న అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక బిజినెస్ వర్గాలకు చేయగలిగినంత సాయం చేసింది..ఏనాడు ఇబ్బంది పెట్టలేదు. అగ్రవర్ణ పెదళకు కూడా సాయం చేస్తున్నది ఒక్క టిఆర్ఎస్ ప్రభుత్వమే. వైశ్య కార్పొరేషన్ టిఆర్ఎస్ మేనిఫాస్టో లోనే ఉన్నది.. నూటికి నూరు శాతం ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు.

ఇంటింటికి నీళ్లు తెచ్చాము.. సాగుకు కాళేశ్వరం నీళ్లు త్వరలోనే వస్తున్నాయి. ఒక్క సారి కాళేశ్వరం నీళ్లు వస్తే దుబ్బాక రూపురేఖలే మారిపోతాయి. సుజాతక్కను భారీ మెజారిటీతో గెలిపించి సీఎం కేసీఆర్ మనస్సు గెలుచుకుందాం.. దుబ్బాకకు భారీ ఎత్తున నిధులు తెచ్చుకుందాం. నిధులపై సవాల్ విసిరితే బీజేపీ ముఖం చాటేసిందని మంత్రి హరీష్‌ ఎద్దేవ చేశారు.

ఎమ్మెల్యే గణేష్ గుప్త మాట్లాడుతూ.. వైశ్యులను గుర్తించి పదవులు కట్టబెడుతున్న ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం.అతి త్వరలో వైశ్య కార్పొరేషన్ వస్తుంది.సర్వేలన్ని టిఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలవబోతున్నట్లు చెబుతున్నాయి. సుజాతను భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన భాద్యత వైశ్యులపై ఉన్నది అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

- Advertisement -