హైదరాబాద్ తర్వాత శరవేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్ ఐటీ రంగంలో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకోబోతోంది. మడికొండలోని ఐటీ పార్క్‌లో సైయంట్, టెక్ మహీంద్రా వంటి సాఫ్ట్‌వేర్ దిగ్గజ కంపెనీలు అత్యాధునిక సాంకేతిక హంగులతో తీర్చిదిద్దిన క్యాంపస్‌లను రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
ప్రస్తుతం మడికొండ ఐటీ పార్క్‌లో 70 ప్లాట్లుండగా ఇప్పటికే 20 ప్లాట్లు ఆయా ఐటీ కంపెనీలకు కేటాయింపులు జరిగిపోయాయి. సైయంట్‌కు ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించగా రెండేళ్ల క్రితం కేటీఆర్ భూమి పూజ చేశారు.ప్రస్తుతం సైయంట్‌తోపాటు, టెక్ మహీంద్రా, వెంటాయిస్, కాకతీయ ఐటీ సొల్యూషన్స్ వంటి కంపెనీలు ఐటీ పార్క్‌లో తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి.
స్ధానికంగా ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకు ఈ క్యాంపస్‌ల ప్రారంభంతో ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. హైదరాబాద్‌తో పోల్చుకుంటే అతి తక్కువ ట్రాఫిక్, కాలుష్యరహిత నగరంగా ఉన్న వరంగల్ ఉద్యోగులకు చాలా అనువుగా ఉంటుందని ఐటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.