మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీదే విజయం

454
etela rajender

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీదే విజయం అన్నారు రాష్ట్ర రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు వచ్చినప్పుడే కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలు గుర్తుకు వస్తారన్నారు. ఎన్నికలు అంటే ప్రతిపక్షాలకు భయం వేస్తుందని..అందుకే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే కోర్టుల చుట్టు తిరుగుతున్నారని అన్నారు.

సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయని చెప్పారు. ప్రతిపక్షాలు ఎన్నికుట్రలు చేసిన టీఆర్ఎస్ పార్టీయే విజయం సాధిస్తుందన్నారు. కౌన్సిలర్ల ఎన్నిక తర్వాతనే మున్సిపల్‌ ఛైర్మన్ల ఎంపిక ప్రక్రియ ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. అభ్యర్థులకు బీ ఫారాలు ఇవ్వడంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజలను ఓట్లు అడిగే హక్కు కాంగ్రెస్, బీజేపీలకు లేదన్నారు మంత్రి ఈటెల .