రూ.6కోట్ల ఆఫర్ ను వదులుకున్న డైరెక్టర్ మారుతి

528
maruthi
- Advertisement -

ప్రతిరోజూ పండగే సినిమా బ్లాక్ బాస్టర్ హిత్ తో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు దర్శకుడు మారుతి. సాయి ధరమ్ తేజ్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రం భారీ విజయాన్ని సాధించింది. అటు సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో కూడా ఈమూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మారుతి తర్వాతి సినిమా ఎవరితో చేస్తాడన్నదానిపై ఆసక్తి నెలకొంది. తాజాగా ఉన్న సమాచారం మేరకు మారుతి మహేశ్ బాబుతో సినిమా చేయాల్సి ఉంది. కానీ మహేశ్ డేట్స్ కుదరకపోవడంతో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం లేదు.

అయితే మారుతికి ఓ బడా నిర్మాత భారీ ఆఫర్ ను ప్రకటించాడట. ఆర్ఆర్ఆర్ మూవీ నిర్మాత దానయ్య తనకొడుకును హీరోగా లాంచ్ చేయాలని చూస్తున్నాడు. దానయ్య కుమారుడు ఇప్పటికే యాక్టింగ్ కోర్సు ను పూర్తి చేశాడు. దీంతో త్వరలోనే సినిమాను తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నాడు నిర్మాత దానయ్య. అందుకోసం మారుతిని సంప్రదించాడట. అంతేకాదు ఈసినిమాకు మారుతికి ఏకంగా రూ. 6కోట్లు ఆఫర్ చేశాడట. అయితే మారుతి ఈ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించాడట. ఇంత పెద్దమొత్తంలో ఆఫర్ వచ్చినా మారుతి వదులుకున్నాడంటే పెద్ద హీరోతో సినిమా కన్ఫామ్ అయింటుందని సినీ వర్గాల సమాచారం.

- Advertisement -