- Advertisement -
ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతూ నిర్మించిన బైరామల్‌గూడ జంక్షన్ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించారు మంత్రి కేటీఆర్. మంత్రి సబితా ఇంద్రారెడ్డి,మేయర్ బొంతు రామ్మోహన్‌తో కలిసి ఫ్లై ఓవర్‌ని ప్రారంభించారు.సికింద్రాబాద్ నుండి ఒవైసీ జంక్షన్‌కు, శ్రీశైలం వెళ్లే వాహనదారులకు కూడా ఈ ఫ్లైఓవర్ ఉపయోగకరంగా ఉండనుంది.
ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్…ఎస్ఆర్‌డీపీ ప్యాకేజీ 2లో రూ. 448 కోట్ల అంచనా వ్యయంతో ఎల్బీనగర్ నియోజక వర్గం లో చేపట్టిన 14 పనులలో ఇప్పటి వరకు 6 పూర్తి అయ్యాయని తెలిపారు.
రూ. 26.45 కోట్ల అంచనాతో 784 మీటర్ల పొడవుతో ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. ఇప్పటికే ఎల్బీనగర్ జంక్షన్‌లో నిర్మించిన కుడి వైపు ఫ్లైఓవర్ తో పాటు అండర్ పాస్, కామినేని జంక్షన్‌లో కుడి వైపుతో పాటు ఎడమ వైపు ఫ్లైఓవర్ , చింతల్ కుంట అండర్ పాస్‌లు అందుబాటు లోకి వచ్చాయి.
- Advertisement -