ఎన్టీఆర్-బాబీ సినిమాకు టైటిల్ దొరికింది..

101
ntr

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్ట్స్ చేయబోయే సినిమా రోజుకో మలుపు తిరుగుతుంది. గబ్బర్ సింగ్ డైరెక్టర్ బాబీతో చేయబోతున్నతారక్ న్యూ ప్రాజెక్ట్ కు మరో కొత్త టైటిల్ తెరపైకి వచ్చింది. ‘జై లవకుశ’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కళ్యాణ్ రామ్ ఈ టైటిల్ ను ఫిల్మ్ ఛాంబ‌ర్‌లో రిజిస్టర్ చేయించాడడంతో..తారక్, బాబీ సినిమాకు ఇదే టైటిల్ అయింటుందని ప్రచారం జరుగుతోంది. జై, లవ, కుశ ఇలా మూడు పేర్లు ఉండడంతో ఇందులో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తాడనే వార్త కూడా బయటికొచ్చి ఈ ప్రాజెక్టుపై హైప్‌ను మ‌రింత పెంచాయి.

ntr

ఈసినిమాకు ముందుగా న‌ట విశ్వ‌రూపం అనే టైటిల్ ఆలోచిస్తున్నారంటూ వార్త‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. కానీ అంతలోనే కళ్యాణ్ రామ్ ఇవన్ని రూమర్సే నంటూ వివరణ ఇవ్వడంతో..తారక్, బాబీ సినిమా లేనట్టని అనుకున్నారు. తారక్ నెక్ట్స్ త్రివిక్రమ్ తో సినిమాకు సిద్ధమవుతున్నాడని టాక్ వినిపించింది. కానీ అంతలోనే కథ మళ్లీ మొదటికి వచ్చింది. తారక్,బాబీ సినిమా ఆగిపోలేదనే ప్రచారం జోరందుకుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ నిర్మించే ఈ సినిమా గురించి త్వ‌ర‌లోనే అఫీషీయ‌ల్ ప్రాజెక్టుపై పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డి కానున్నాయి.

ఇక గ‌తంలోనే ల‌వ‌కుశ టైటిల్‌తో సీనియ‌ర్ ఎన్టీఆర్ హీరోగా వ‌చ్చిన సినిమా చ‌రిత్ర‌లో నిలిచిపోయిన సినిమాగా రికార్డుల‌కు ఎక్కింది. మ‌రి ఇప్పుడు అదే టైటిల్‌తో వ‌స్తోన్న జై ల‌వ‌కుశ ఎన్ని సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తుందో చూడాలి. టెంప‌ర్ – నాన్న‌కు ప్రేమ‌తో – జ‌న‌తా గ్యారేజ్ లాంటి మూడు వ‌రుస హిట్ల త‌ర్వాత ఎన్టీఆర్ ప‌ట్టాలెక్కిస్తున్న ఈసినిమాపై ఇప్పటికే అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి.