దుబాయ్‌లో తెలంగాణ యువతి కష్టాలు..స్పందించిన కేటీఆర్

319
ktr twitter
- Advertisement -

ఇంట్లో కష్టాలు…పొట్టకూటికోసం దుబాయ్ వెళ్లిన ఓ యువతి అష్టకష్టాలు పడింది. ఎలాగోలా ఓ సెల్ ఫోన్ సంపాదించి,తన కష్టాలను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తే ఆ వీడియో కేటీఆర్‌కి చేరింది. ఉపాధి కోసం వెళ్లిన తాను, ఒక ఇంట్లో పనికి కుదిరి, ఆ ఇంటి యాజమాని కుటుంబం కారణంగా ఇక్కట్లు పడుతున్నానని ఆ యువతి వీడియోలో పోస్టు చేసింది.

దీంతో వెంటనే స్పందించిన కేటీఆర్ దుబాయ్‌లోని భారత రాయబారి నవదీప్ సూరిని ట్యాగ్‌ చేస్తూ సమస్యను పరిష్కరించాలని సూచించారు. బాధిత మహిళ క్షేమంగా తిరిగి ఇంటికి చేరుకునేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. వెంటనే స్పందించిన రాయబారి, ఆమె ఆచూకీ కోసం చర్యలు చేపడతామంటూ ట్విటర్‌ లో సమాధానమిచ్చారు.

- Advertisement -