కేసీఆర్ అమలు చేస్తారు – దేశం అనుసరిస్తుంది అని ఎక్స్ వేదికగా తెలిపారు మాజీ మంత్రి హరీశ్ రావు. రైతు బంధు ➝ ప్రధాన్ మంత్రి కిసాన్,మిషన్ భగీరథ ➝ హర్ ఘర్ జల్,మిషన్ కాకతీయ ➝ మిషన్ అమృత్ సరోవర్,మొబైల్ వెటర్నరీ అంబులెన్స్ 1962 (2017, తెలంగాణ) ➝ దేశం అనుసరించింది,ఆరోగ్య మహిళ (2023) ➝ స్వస్థ నారి శక్తి (2025) అని ఎక్స్ వేదికగా తెలిపారు.
నిన్న పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ప్రారంభించిన స్వస్థ నారి పథకం, ఇప్పటికే కేసీఆర్ 2023 మార్చిలోనే ఆరోగ్య మహిళ పేరుతో ప్రారంభించారు అని గుర్తు చేశారు కేటీఆర్. ఎలా రైతు బంధు → ప్రధాన్ మంత్రి కిసాన్ అయిందో, ఇప్పుడు ఆరోగ్య మహిళ → స్వస్థ నారి అయింది అన్నారు.
ఆరోగ్య మహిళ ప్రభావం (మార్చి–సెప్టెంబర్ 2023లో కేవలం 6 నెలల్లో):
• 2,78,317+ మహిళలు స్క్రీనింగ్ చేయించుకున్నారు
• తెలంగాణ అంతటా 373 క్లినిక్స్
• 1.7 లక్షల పైగా నోటి క్యాన్సర్ పరీక్షలు
• 1.7 లక్షల పైగా వక్షోజ క్యాన్సర్ పరీక్షలు
• 40,000+ సర్వికల్ క్యాన్సర్ పరీక్షలు
• 13,673 మందిని అనుమానిత క్యాన్సర్ కేసులుగా రిఫర్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆరోగ్య మహిళను రద్దు చేసింది. ఇప్పుడు అదే ప్రభుత్వం, కేంద్రంతో కలిసి #SwasthNariSashaktParivar పేరుతో, బీఆర్‌ఎస్ వేసిన పునాది మీదే కొత్త పథకాన్ని వేడుకగా జరుపుకుంటోంది అని తెలిపారు కేటీఆర్.
KCR implements – Nation Follows
Rythu Bandhu ➝ PM-Kisan
Mission Bhagiratha ➝ Har Ghar Jal
Mission Kakatiya ➝ Mission Amrit Sarovar
Mobile Veterinary Ambulanc 1962 (2017, Telangana) ➝ Nation followed
Aarogya Mahila (2023) ➝ Swasth Nari Shakti (2025)
Jai Telangana!
Jai… https://t.co/Qs51wLW0s9— Harish Rao Thanneeru (@BRSHarish) September 19, 2025
Also Read:TTD:శేషాచల స్వామి ఆలయంలో ఉత్సవాలు

