సీఎం రేవంత్‌పై రాజగోపాల్ మరో ట్వీట్

6
- Advertisement -

మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి రాసిన ఆర్టికల్ ను ట్యాగ్ చేస్తూ ఎక్స్   వేదికగా ట్వీట్ చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అసెంబ్లీ నియోజకవర్గంలోని స్థానిక సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చాలంటూ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి గారు చేసిన సూచనను మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నాను అన్నారు.

మెజారిటీ ఎమ్మెల్యేల అభిప్రాయం కూడా ఇదే అని నేను భావిస్తున్నాను. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఉపయోగపడతాయి అన్నారు.

సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే, స్థానిక సమస్యల పరిష్కారానికి అవసరమైన మేరకు నిధులు కేటాయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్న వాస్తవాన్ని ముఖ్యమంత్రి గుర్తించి వ్యవహరించాలి అన్నారు.

 

Also Read:ఆరోగ్య మహిళ..స్వస్థ నారి శక్తి

- Advertisement -