మళ్లీ కేసీఆర్ రావాలంటే జూబ్లీహిల్స్ నుంచే మన విజయం మొదలు కావాలి అన్నారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మన నాయకుడు చనిపోతే ఆయన కుటుంబానికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది… మొన్న కాంగ్రెస్ పార్టీ మైనారిటీ అయిన అజారుద్దీన్ కు టికెట్ ఇచ్చింది..ఇప్పుడు అది కూడా ఇవ్వకుండా అజారుద్దీన్ కు ఎమ్మెల్సీ ఇస్తాం అంటున్నారు అన్నారు.
సుప్రీం కోర్టు లో కేసు ఉన్న ఆ ఎమ్మెల్సీ లను అజారుద్దీన్ కి ఇస్తాం అంటున్నారు… ఇంకా సుప్రీంకోర్టు లో ఇంకా ఎమ్మెల్సీ ల కేసు పెండింగ్ లో ఉంది అని తెలిపారు కేటీఆర్. అయినా క్యాబినెట్ లో డిసైడ్ చేసి అజారుద్దీన్ ఎమ్మెల్సీ ఇస్తాం అని మోసం చేస్తున్నారు… అజారుద్దీన్ నాకు మంచి మిత్రుడు.. ఆయనకు ఇలా అవుతోంది అంటే మైనారిటీ లు ఆలోచించాలి అన్నారు.
ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టే రాజ్యం…అలాంటి ఇండ్లు కూలగొట్టే కాంగ్రెస్ పార్టీ మనకు కావాలా,హైడ్రా మన ఇండ్ల మీదకు ఎప్పుడు వస్తుందో తెలియదు…ఈ బుల్డోజర్ ల పార్టీ మనకు వద్దు అన్నారు. అధికారం లో ఉంది కాబట్టి కాంగ్రెస్ కొంత హంగామా చేస్తుంది… కేస్ లు పెడతామని బయ పెడతారు, కేస్ లకు అస్సలు బయపడకూడదు, జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ను గెలిపిస్తే హామీలు నెరవేర్చకున్నా ఏమి కాదు అని కాంగ్రెస్ అనుకుంటారు అన్నారు.
రేవంత్ రెడ్డి దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి… ఓటు కు ఐదు, పది వేలు ఇవ్వడానికి కూడా వెనుకాడరు, ఆ డబ్బులు బరాబర్ తీసుకోండి..brs కు మాత్రం ఓటు వేయండి…. తెలంగాణ లో ముగ్గురు అక్కలు మాత్రమే సంతోషం గా ఉన్నారు… సీఎం భార్య గీతక్క,మంత్రులు సీతక్క ,సురేఖ అక్క లు మాత్రమే హ్యాపీ గా ఉన్నారు అని ఎద్దేవా చేశారు కేటీఆర్.
Also Read:బండ్ల గణేష్..సంచలన వ్యాఖ్యలు

