యూరియా అడిగితే అరెస్టులా?

3
- Advertisement -

రాష్ట్రంలో యూరియా కొరతను నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. అసెంబ్లీ నుంచి అగ్రికల్చర్ కమిషనరేట్‌కు ర్యాలీగా వెళ్లి… వ్యవసాయ శాఖ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.

అనంతరం ఆందోళనకు దిగిన కేటీఆర్, హరీశ్ రావు, నిరంజన్ రెడ్డితోపాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అరెస్టు చేశారు. యూరియా కావాలని అడిగితే అరెస్ట్ చేస్తారా అని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. గణపతి బప్పా మొరియా…కవాలయ్యా యూరియా అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

శనివారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభ వాయిదా అనంతరం హరీశ్ రావు, కేటీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలతో కలిసి అసెంబ్లీ ఆవరణం నుంచి వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి యూరియా కొరతను నిరసిస్తూ ర్యాలీగా వెళ్లారు. యూరియా కొరతపై వ్యవసాయ శాఖ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం బయటకుకొచ్చి యూరి కొరతను నిరసిస్తూ బీఆర్ఎస్ సభ్యులు, నేతలు ఆందోళనకు దిగారు.

ప్రభుత్వం స్పందించే వరకు ఇక్కడినుంచి కదలబోమని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. ఆందోళనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియాకోసం రైతులు రోడ్లెక్కి ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వానికి కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు.

Also Read:చివరి శ్వాస వరకు ప్రజాజీవితంలోనే!

- Advertisement -