ఇదేనా ప్రజా పాలన:హరీష్‌

6
- Advertisement -

యూరియా అడిగినందుకు రైతు చెంప చెల్లుమనిపించడమేనా మీ సోకాల్డ్ ప్రజా పాలన? అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు. ఈ ముఖ్యమంత్రికి తెలిసిన విద్యలు రెండే.. మూటలు మోయడం.. మాటలు మార్చడం ,యూరియా విషయంలో మొదటి నుంచి ఇప్పటిదాకా ఏం చెప్పారు అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో యూరియా కొరతే లేదన్నారు..ఏఐతో ఫేక్ ఫోటోలతో ప్రచారం అన్నారు.రాష్ట్రంలో రైతుల క్యూలైన్లే లేవన్నారు.తరువాత..క్యూలో ఉన్నవాళ్లు రైతులే కాదన్నారు..బీఆర్ఎస్ కార్యకర్తలే లైన్ లో నిల్చున్నారన్నారు..చివరికి యూరియా కొరత నిజమేనని ఒప్పుకున్నారు కానీ కారణం మాది కాదు కేంద్రంలోని బీజేపీదన్నారు.

రష్యా ఉక్రెయిన్ వార్ వల్లే ఈ సంక్షోభం అన్నారు..యుద్ధం వల్ల కాదు.. కాంగ్రెస్ సిద్ధంగా లేకపోవడం వల్ల యూరియా సంక్షోభం అని రైతులకు అర్థమైపోయింది.రైతులపై చేయి చేసుకున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, యూరియా సరఫరా చేయడంలో విఫలమైన ఈ సర్కారు యావత్ రైతాంగానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు హరీష్.

Also Read:చివరి శ్వాస వరకు ప్రజాజీవితంలోనే!

- Advertisement -