చివరి శ్వాస వరకు ప్రజాజీవితంలోనే!

7
- Advertisement -

నన్ను చంపేస్తే డబ్బు ఇస్తామన్నది ఎవరు..?.. జిల్లా ఎస్పీకి 3 రోజుల ముందే ఈ వీడియో గురించి తెలిసినా నాకు ఎందుకు చెప్పలేదు..? అన్నారు టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. హత్యకుట్రపై స్పందించిన కోటంరెడ్డి… రౌడీషీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులు నన్ను చంపే కుట్రకు సంబంధించిన వీడియో చూసి షాక్ అయ్యానని చెప్పారు.

భయం అనే పదం నా డిక్షనరీలోనే లేదు… వైసీపీ బెదిరింపులకు నేను కాదు కదా నా మనవడు కూడా భయపడడు అన్నారు. నా తమ్ముడు గిరిధర్ రెడ్డి.. నాపై హత్యకు కుట్ర చేశాడని వైసీపీ నేతలు ఆరోపించారు.. రాజ్యాధికారం కోసం సొంత వాళ్లను హతమార్చిన డీఎన్ఏ మీది.. మాది కాదు..విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడే రౌడీలను తరిమికొట్టిన చరిత్ర నాది అన్నారు.

వైరల్ అయిన వీడియో అబద్ధమా?.. దాంట్లో మాట్లాడినవి విన్నారు కదా?..ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా న్యాయం కావాల్సిందే కదా?.. వైసీపీ సోషల్ మీడియాకు ఇది కొత్తకాదు.. సొంత కుటుంబసభ్యులను చంపించే సంప్రదాయం మాది కాదు.. ఆస్తులు, అంతస్తుల కోసం తోడబుట్టిన వారిని వేధించే సంప్రదాయం మాది కాదు అన్నారు.నాకు, నా కుటుంబ సభ్యులకు చాలా బెదిరింపులు వచ్చాయి.. ఏ బెదిరింపులకు నేను భయపడకుండా గట్టిగా నిలబడ్డా.. తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు.. ప్రజలు, నా వెంట నడిచే కార్యకర్తల కోసం దేన్నైనా ఎదుర్కొంటా.. ఎవరి బెదిరింపులకు భయపడను.. చివరి శ్వాస వరకు ప్రజాజీవితంలో కొనసాగుతానని స్పష్టం చేశారు కోటంరెడ్డి.

Also Read:మాగంటి..ఎన్టీఆర్‌కు గొప్ప భక్తుడు:రేవంత్

- Advertisement -