మెహిదీపట్నంలో స్కై వాక్ నిర్మాణం‌..త్వరలో టెండర్లు

305
sky walk
- Advertisement -

స్వరాష్ట్రంలో అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది హైదరాబాద్. గ్రేటర్‌ను విశ్వనగరంగా మార్చేందుకు ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటోంది. తాజాగా మెహిదీప‌ట్నం వ‌ద్ద పాదాచారుల కోసం స్కై వాక్‌ను నిర్మించేందుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.

మెహిదీపట్నం వద్ద స్కై వాక్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ ఆమోదం తెలిపారని వెల్లడించారు పుర‌పాల‌క శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ అర‌వింద్ కుమార్. ఈ మేరకు ట్విట్టర్లో ట్వీట్ చేసిన ఆయన త్వరలోనే టెండ‌ర్లను ఆహ్వానించ‌నున్నామని వెల్లడించారు.

ఈ ప్రాజెక్టులో భాగంగా అక్క‌డున్న బ‌స్ షెల్ట‌ర్స్ ను కూడా రీడిజైన్ చేయ‌నున్నారు. పాదాచారుల స్కైవాక్ 500 మీట‌ర్ల పొడ‌వున స్టీల్‌తో నిర్మించ‌నున్నారు. మొత్తం 16 లిఫ్ట్‌ల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. రైతు బ‌జార్‌లో రెండు లిఫ్ట్‌ల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు.

- Advertisement -