మాట నిలబెట్టుకున్న కేటీఆర్..

8
- Advertisement -

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట ఇస్తే నిలబెట్టుకుంటారన్న సంగతి తెలిసిందే. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం చింతల తండాలో ప్రేమోన్మాది చేతిలో తల్లిదండ్రులను కోల్పోయిన దీపిక, మదన్‌కు రూ.5 లక్షల ఆర్ధిక సాయం చేస్తానని గతంలో మాట ఇచ్చారు కేటీఆర్.

ఇచ్చిన మాట ప్రకారం రూ.5 లక్షలు ఆర్ధిక సాయం చేశారు కేటీఆర్. ఇందుకు సంబంధించిన రూ. 5 లక్షల చెక్కును బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి,దీపిక, మదన్ కుటుంబసభ్యులకు అందించారు. దీంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

Also Read:TTD:లక్కీడిప్‌లో శ్రీవారి అంగప్రదక్షిణ టోకెన్ల కేటాయింపు

- Advertisement -