FMAE నేషనల్ స్టూడెంట్స్ మోటర్ స్పోర్ట్స్ కాంపిటీషన్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరుకానున్నారు. అక్టోబర్ 11వ తేదీన కోయంబత్తూరులోని కుమారగురు ఇన్స్టిట్యూషన్స్లో జరగనుంది ఈ కార్యక్రమం. వారు స్వయంగా రూపొందించిన వాహనాలు, ఆవిష్కరణలు ప్రదర్శించనున్న 101 కాలేజీలకు చెందిన 1300 మంది విద్యార్థులు పాల్గొననున్నారు.
ఫ్రాటర్నిటీ ఆఫ్ మెకానికల్ అండ్ ఆటోమోటివ్ ఇంజనీర్స్ (FMAE) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక పోటీలో విద్యార్థులు తమ స్వయంగా రూపొందించిన వాహనాలు, వినూత్న ఆవిష్కరణలను ఈ వేదికపై ప్రదర్శిస్తారు. ఈ ప్రాజెక్టులను అంతర్జాతీయ స్థాయిలోని అగ్రగామి ఆటోమోటివ్ కంపెనీలకు చెందిన 25 మంది నిపుణుల జ్యూరీ సభ్యులు మూల్యాంకనం చేయనున్నారు.
కేటీఆర్‌కు పంపిన ఆహ్వానంలో ఎఫ్ఎంఏఈ సంస్థ… ఆయన నాయకత్వాన్ని, మోటార్‌స్పోర్ట్స్ పట్ల ఆయనకున్న నిబద్ధతను ప్రత్యేకంగా ప్రశంసించింది. ముఖ్యంగా హైదరాబాద్‌కు ఫార్ములా-ఈ రేసింగ్‌ను తీసుకురావడం ద్వారా తెలంగాణను గ్లోబల్ మోటార్‌స్పోర్ట్ మ్యాప్‌పై నిలబెట్టడంలో కేటీఆర్ పోషించిన పాత్ర అభినందనీయమని కొనియాడింది.
Also Read:ఇన్సురెన్స్ డబ్బుల కోసం..చంపేశారు!

