ఇన్సురెన్స్ డబ్బుల కోసం..చంపేశారు!

9
- Advertisement -

రూ.5 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఓ వ్యక్తిని హత్య చేసింది ముఠా. సినిమా సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించే సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. హోస్పేట్ శివారులో గత నెల 28న XL వాహనాన్ని, గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో గంగాధర అనే వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులకు సమాచారమిచ్చారు స్థానికులు.

గంగాధర పక్షవాతంతో బాధపడుతున్నాడని, అతను బండి నడిపే స్థితిలో లేడని అతని భార్య తెలపడంతో రంగంలోకి దిగారు పోలీసులు. హోస్పేట్‌లోని గంగావతి ప్రభుత్వ కళాశాల వైస్ ప్రిన్సిపల్ కృష్ణ, బ్యాంకు ఉద్యోగి యోగరాజ్ సింగ్, గోసంగి రవి, అజయ్, రియాజ్ ముఠాగా ఏర్పడి పథకం పన్ని హత్య చేసినట్లు ఛేదించారు పోలీసులు.

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న గంగాధరకి రూ.5 కోట్ల జీవిత బీమా, రూ. 25 లక్షల ప్రమాద బీమా చేయించి, నామినిగా హులిగెమ్మ అనే ఓ మహిళను ఒప్పించి అతని భార్యగా పరిచయం చేసింది ఈ ముఠా. గంగాధర చనిపోయేలా లేడని, ప్రమాద బీమా రూ.25 లక్షల కోసం హత్య చేయాలని నిర్ణయించుకొని, కిడ్నాప్ చేసి, హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. మృతుడి భార్య అనుమానంతో లోతుగా పరిశీలించి, కిల్లర్‌ ముఠాను పట్టుకున్నారు పోలీసులు. ఇంతకు ముందు కూడా ఇలా బీమా డబ్బుల కోసం ఏమైనా హత్యలు చేశారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు పోలీసులు.

Also Read:డిసెంబర్ 5న అఖండ 2: తాండవం!

- Advertisement -